‘పవర్‌ ఆఫ్‌ స్టార్‌’ టీజర్‌కి విశేష స్పందన

‘పవర్‌ ఆఫ్‌ స్టార్‌’ టీజర్‌కి విశేష స్పందన

Published on Oct 14, 2015 3:17 PM IST

power-of-star
తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కు వున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, అతనికి వున్న క్రేజ్‌ మరే హీరోకి లేదనే చెప్పాలి. తన సినిమాలు ఎలా వున్నా అతని అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో పవన్‌కళ్యాణ్‌ని ఆదరిస్తూనే వుంటున్నారు. పవన్‌ ఆశయాలను తమ ఆశయాలుగా చేసుకున్న ఎంతో మంది అభిమానులు తమదైన రీతిలో ప్రజలకు సేవలు చేస్తున్నారు. కంటెంట్‌ వున్నోడికి కటౌట్‌ చాలు అని ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో బ్రహ్మానందం చెప్పినట్లు తనని అభిమానించే ప్రతి ఒక్కరికీ పవన్‌ అండగా వుంటారని ఫ్యాన్స్‌ నమ్ముతారు.

పవన్‌కి ఆదర్శంగా తీసుకుని ‘పవర్‌ ఆఫ్‌ స్టార్‌’ అనే ష్టార్‌ ఫిలింని తీస్తున్నారు కొంతమంది అభిమానులు. రాజేందర్‌ కల్లూరి రచన-దర్శకత్వంలో రూపొందుతున్న ‘పవర్‌ ఆఫ్‌ స్టార్‌’ షార్ట్‌ ఫిలిం ప్రమోషనల్‌ టీజర్‌ ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజేందర్‌ కల్లూరి మాట్లాడుతూ… ”గాంధీ, మదర్‌ థెరిసాలను స్ఫూర్తిగా తీసుకోకుండా పవన్‌కళ్యాణ్‌నే ఎందుకు స్ఫూర్తిగా తీసుకున్నారనే పాయింట్‌తో,,, పవన్‌కళ్యాణ్‌ ఆలోచనలు, ఆశయాలు, సిద్ధాంతాలను తెలియజేసే ప్రయత్నమిది. ఇటీవల విడుదలైన టీజర్‌కి విశేషమైన స్పందన లభిస్తోంది, ఈ షార్ట్‌ ఫిలిం ప్రతీ పవన్‌ అభిమానికి గర్వకారణంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో ఈ ‘పవర్‌ ఆఫ్‌ స్టార్‌’ని విడుదల చేయడన్నానికి సన్నాహాలు చేస్తున్నాము” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు