“ఏక్ మినీ క‌థ” సెకండ్ సింగిల్ కు మంచి రెస్పాన్స్.!

Published on Apr 21, 2021 12:00 pm IST

ఓ పక్క భారీ చిత్రాలతో పాటుగా కొత్త దర్శకులకు కూడా అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. ‘డజ్ సైజ్ మేటర్స్’ అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

గోల్కొండ హై స్కూల్, పేపర్ బాయ్ లాంటి సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈయన లుక్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ఈ మాయలో.. లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ఆడియో నుంచి మ‌రో పాట విడుద‌లైంది.

సామిరంగా అంటూ సాగే ఈ పాట విడుద‌లైన అతి కొద్ది స‌మ‌యంలోనే సోష‌ల్ మీడియాలో విశేష స్పంద‌న అందుకుంటూ చాట్ బ‌స్ట‌ర్ గా మారింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు.

కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలోనే తెలియజేయనున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :