బిగ్‌బాస్ 5 విన్నర్ ఎవరో అప్పుడే తెలిసిపోయిందిగా..!

Published on Sep 24, 2021 1:45 am IST


బుల్లి తెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ తెలుగు ఈ మధ్యే ప్రారంభమైంది. 19 మంది హౌస్‌లోకి వెళ్లగా ఇద్దరు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో ఇంకా 17 మంది సభ్యులు ఉన్నారు. ఎలాగైనా టైటిల్ సాధించాలని హౌస్‌లోని సభ్యులంతా చాలా తెలివిగా ఆడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ మొదలై కేవలం రెండు వారాలే అయ్యింది కానీ అప్పుడే ఈ సీజన్ విన్నర్ ఎవరో గూగుల్ చెప్పేయడం ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

అయితే గూగుల్‌లో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ ఎవరని టైప్‌ చేయగా సింగర్‌ శ్రీరామచంద్ర పేరు చూపిస్తుంది. అంతేకాదు శ్రీరామచంద్ర ప్లేబ్యాక్‌ సింగర్‌, నటుడు అని ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 5 విజేత అని కూడా చూపిస్తుంది. ఇదేకాకుండా గూగుల్‌లో బిగ్‌బాస్‌ 5 తెలుగు టైటిల్‌ విన్నర్‌ ఎవరని టైప్‌ చేయగా ప్రియాంక సింగ్‌ను విజేతగా చూపిస్తుంది.

సంబంధిత సమాచారం :