ఆలిస్టులో సాహో ఉంటుంది అనుకుంటే, సందీప్ రెడ్డి సినిమా చేరింది..!

Published on Dec 12, 2019 7:14 am IST

మరి కొద్దిరోజులలో 2019 ముగియనుంది. అలాగే 2019 సినిమా క్యాలెండర్ ముగియడంతో పాటు 2020 నూతన సినీ క్యాలెండర్ మొదలుకానుంది. దీనితో గూగుల్ ఇండియా ఈ ఏడాదికి గాను ప్రేక్షకులు ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాల జాబితా విడుదల చేసింది. ఈ ఏడాది అధికంగా ప్రేక్షకులు గూగుల్ లో సెర్చ్ చేసిన జాబితాలో కబీర్ సింగ్ మెదటి స్థానములో నిలిచింది. ఆ తరువాత హాలీవుడ్ మూవీస్ ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’, ‘జోకర్’, ‘కెప్టెన్ మార్వెల్’ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇక, ‘సూపర్ 30′, ‘మిషన్ మంగళ్’, ‘గల్లీ బాయ్’, ‘వార్’, ‘హౌస్‌ఫుల్ 4′, ‘ఉరి’ వరుసగా మిగిలిన స్థానాలను దక్కించుకున్నాయి.

ఐతే టాప్ టెన్ లిస్ట్ లో దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైన సాహో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది సాహో మూవీ పై జరిగినంత చర్చ, ఆ మూవీపై ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలు మరే చిత్రానికి రాలేదు. సాహో గురించి దాదాపు కొన్ని నెలలు సినీ ప్రేమికులు ప్రముఖంగా చర్చించుకున్నారు. ఇక విడుదల తరువాత తెలుగుతో పాటు, సౌత్ లాంగ్వేజ్ లలో ఈ మూవీ విఫలం చెందినప్పటికీ.. హిందీలో హిట్ మూవీగా నిలిచింది. అక్కడ సాహో 150కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరి ఇలాంటి చిత్రానికి టాప్ టెన్ లిస్ట్ లో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

ఐతే తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన కబీర్ సింగ్ చిత్రం లిస్ట్ నందు టాప్ లో నిలిచి అబ్బురపరిచింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించగా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 300కోట్లకు పైగా వసూళ్లతో 2019సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలించింది. ఇలా ఆ లిస్ట్ లో సాహో ఉంటుంది అంకుంటే సందీప్ రెడ్డి మూవీ వచ్చి చేరింది. ఐతే సౌత్ ఇండియా పరిధిలో సాహో ఈ లిస్ట్ లో చేరినట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More