పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటించనున్న మల్టీ స్టారర్ సినిమా కి ‘గోపాల గోపాల’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా ఈ రోజు ఉదయం 9 గంటలకు రామా నాయుడు స్టూడియోస్ లో లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, వెంకటేష్ లతో పాటు హీరోయిన్ శ్రియ శరన్, డా. డి. రామానాయుడు, సురేష్ బాబు, శరత్ మరార్ లు కూడా హాజరయ్యయారు.
మరి కొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి డాలీ దర్శకత్వం వహించనున్నాడు. ఇది బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్. ఈ కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథని మార్పులు చేసారు. హిందీలో స్వామీజీ పాత్ర చేసిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రబోర్తి అదే పాత్రని తెలుగులో కూడా చేయనున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్నాడు.


