టాలీవుడ్ క్రేజీ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు పాటలు మరియు కొంత టాకీ పార్ట్ మాత్రమే బాలన్స్ ఉంది. మిగిలి ఉన్న రెండు పాటల్లో ఓ పాటని ఈ రోజు నుంచి వైజాగ్ లో షూట్ చేస్తున్నారు.
వెంకటేష్, శ్రియ శరన్ లతో పాటు పలువురు కీలక నటీనటులు పాల్గొనే ఈ సాంగ్ షూటింగ్ కోసం వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ లో ఓ స్పెషల్ సెట్ ని వేసారు. ఈ రోజు నుంచి నాలుగు రోజులు పాటు ఈ పాట షూటింగ్ జరగనుంది. త్వరలోనే ఈ చిత్ర టీం మరో షెడ్యూల్ కోసం వారణాసి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ దేవుడుగా కనిపించనుండడం వలన తన ఇంట్రడక్షన్ సాంగ్ ని చాలా స్పెషల్ గా ఉండేలా షూట్ చేసారు.
వెంకటేష్ ఓ కామన్ మాన్ గా కనిపించనున్న ఈ సినిమా కథాంశం మొత్తం ఒక కామన్ మాన్ కి, దేవుడికి మధ్య జరగుతుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. డి.సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


