సమీక్ష : “భీమా” – మాస్ ఆడియన్స్ కు మాత్రమే

సమీక్ష : “భీమా” – మాస్ ఆడియన్స్ కు మాత్రమే

Published on Mar 9, 2024 3:01 AM IST
Bhimaa Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 08, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు

దర్శకుడు: ఏ హర్ష

నిర్మాత: కేకే రాధామోహన్

సంగీత దర్శకులు: రవి బస్రూర్

సినిమాటోగ్రాఫర్‌: స్వామి జె గౌడ

ఎడిటింగ్: తమ్మిరాజు

సంబంధిత లింక్స్: ట్రైలర్

గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ భీమా నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది పూర్తి సమీక్షలో చూద్దాం.

కథ :

భీమా (గోపీచంద్) తనదైన స్టైల్ లో క్రిమినల్స్ ని పట్టుకుని వారి ఆట కట్టించే పోలీస్ అధికారి. అయితే మహేంద్రగిరిని ఏలుతున్న భవాని (ముకేశ్ తివారి) కి అతడు పెద్ద సమస్యగా మారతాడు. ఒకానొక సమయంలో స్కూల్ టీచర్ గా పని చేస్తున్న విద్యతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు భీమా. అయితే తన మందులతో ఎందరినో కాపాడుతున్న రవీంద్ర వర్మ (నాజర్) అంటే విద్యకు అమితమైన గౌరవం ఉంటుంది. అనంతరం భీమాని రవీంద్ర వర్మ ఒక పనిచేయమని కోరతాడు. అదే పలు పరిస్థితులకు దారి తీస్తుంది, మరి ఇంతకీ భీమాని రవీంద్ర వర్మ కోరింది ఏంటి. భవాని కి భీమాకి మధ్య ఏమి జరిగింది, రవీంద్ర వర్మ అప్పగించిన పనితో భీమా ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, చివరికి ఏమి జరిగింది అనేది మొత్తం సినీరంలో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఇటీవల కాలంలో గోపీచంద్ నటించిన మంచి మాస్ యాక్షన్ పాత్రల్లో భీమా ఒకటి. దీనిని దర్శకుడు హర్ష చక్కగా రాసుకున్నారు. అలానే హీరో గోపీచంద్ కూడా ఆ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. ఇక తన పాత్రలో ఉన్న మరొక కోణాన్ని సైతం గోపీచంద్ సూపర్ గా ప్రదర్శించి ఆడియన్స్ ని అలరించారు. పరశురాముని క్షేత్రం గురించి తెలుపుతూ వచ్చే వాయిస్ ఓవర్ తో ఈ మూవీ ప్రారంభం అవుతుంది. ఇక మొదటి 15 నిముషాలు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు మున్ముందు కథ పై మంచి ఆసక్తిని ఏర్పరుస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే ఎంతో బాగుండడంతో పాటు సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని ఏర్పరుస్తుంది. హీరోయిన్ మాళవిక పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో ఆమె సీన్స్ మరింత బాగున్నాయి. నరేష్, ముఖేష్ తివారీ, రఘుబాబు, చమ్మక్ చంద్ర తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు. ఇక మూవీలో లాస్ట్ అరగంట అయితే ఎంతో బాగుంటుంది. ఎమోషన్స్, పవర్‌ఫుల్ డైలాగ్‌లు, కీలకమైన ట్విస్ట్ మరియు హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు చక్కగా కుదిరాయి మరియు వీటి కారణంగా సీన్స్ బాగా పండుతాయి. వెన్నెల కిషోర్ మరియు రోహిణి పాల్గొన్న కొన్ని కామెడీ మూమెంట్స్ బాగా వచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా తెరకెక్కించారు. రవి బస్రూర్ అందించిన ఇంపాక్ట్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైవోల్టేజ్ సీన్‌లను మరొకస్థాయికి తీసుకువెళ్లింది.

మైనస్ పాయింట్స్ :

మంచి ఇంట్రడక్షన్ సీన్ అనంతరం కథనం మెల్లగా సాగుతుంది. అనంతరం వచ్చే లవ్ ట్రాక్ తో పాటు మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్న కొన్ని వల్గర్ సీన్స్ అయితే కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా భీమా పాత్ర పై నడిపించారు, అయితే అందులో లవ్ ట్రాక్ ఎక్కువగా ఉండడం పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఐతే కథ లోని మెయిన్ పాయింట్ ని ఇంటర్వెల్ బ్లాక్ కి వచ్చే వరకు చూపించకపోవడం కూడా కొంత డ్రా బ్యాక్ అని చెప్పాలి. అనంతరం సెకండ్ హాఫ్ కోసమే ఎక్కువగా ఎదురుచూసేలా రాసుకున్నారు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ కావు. బ్యాక్ అండ్ ఫార్త్ స్టైల్ స్క్రీన్‌ప్లే అతిగా ఉపయోగించడం అనుసరించడంతో ఆడియన్స్ కి దానిని అర్ధం చేసుకోవడం కొంత ఇబ్బందిగా అనిపించి గందరగోళం ఏర్పడుతుంది.

సాంకేతిక వర్గం :

ఇటీవల వస్తున్న పలు సినిమాల మాదిరిగా మంచి యాక్షన్ సీన్స్, విజువల్స్ తో కూడిన కథగానే భీమా కూడా సాగుతుంది. సినిమాటోగ్రఫీ అందించిన స్వామి జె గౌడ అద్భుతంగా పని చేసారు, ముఖ్యంగా నైట్ సీన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. మంచి మాస్ సినిమాకి కావాల్సిన యాక్షన్ సీన్స్ బీమాలో బాగా సెట్ అయ్యాయి. యాక్షన్ తో కూడిన కథలో మంచి ఫాంటసీ ఎలిమెంట్ ని జొప్పించి దర్శకుడు ఏ హర్ష దీనిని బాగానే తెరకెక్కించారు. మాస్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ పోర్షన్స్ ఎంతో బాగున్నాయి. గోపీచంద్ యాక్టింగ్ సూపర్ అని చెప్పాలి. అయితే లవ్ ట్రాక్ సీన్స్ డిజప్పాయింట్ చేస్తాయి. అలానే కొంత స్క్రీన్ ప్లే కూడా ఆడియన్స్ కి గందరగోళంగా అనిపిస్తుంది.

తీర్పు :

మొత్తంగా గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా చూడగలిగే యాక్షన్ మాస్ డ్రామా మూవీ అని చెప్పాలి. గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన మరియు ఫాంటసీ ఎలిమెంట్. మాస్ అంశాలు, చివరి అరగంట, ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు రిచ్ విజువల్స్ భీమా యొక్క మెయిన్ హైలైట్స్. అయితే కొంత వల్గర్ గా అనిపించే లవ్ ట్రాక్ మరియు కొన్ని డైలాగ్‌లు సినిమాని కొందరికే పరిమితం చేస్తుంది. కోర్ పాయింట్‌ని హైలైట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. దానిని మరింత ఎలివేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, భీమా విషయంలో దర్శకుడు పూర్తి స్థాయి సంతృప్తిని అందించలేదు. ఫస్ట్ హాఫ్ అంతకన్నా పర్వాలేదనిపించినా, దర్శకుడు ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్‌తో సెకండ్ హాఫ్ ని బాగానే నడిపించాడు. వీటితో మీరు మాస్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు అయితే ఈ వారాంతంలో భీమాను చూడవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు