తమిళ్ డైరెక్టర్ తో యాక్షన్ హీరో సినిమా మొదలు !

Published on Dec 5, 2018 12:00 am IST

‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించుకున్న గోపీచంద్.. ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కుమార్ అనే ఓ నూతన దర్శకుడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. అలాగే తమిళ దర్శకుడు తిరు చెప్పిన స్టొరీ అద్భుతంగా ఉందని, తన తరువాత సినిమాని ఆ కథనే చెయ్యాలని గోపీచంద్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

కాగా తిరు ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ యాక్షన్ హీరోకి ఎలాగైనా మంచి హిట్ ఇవ్వాలని ఈ తమిళ దర్శకుడు బాగా పట్టుదలగా ఉన్నాడట. మరి గోపీచంద్ కి తిరు హిట్ ఇస్తాడేమో చూడాలి.

ఇక దర్శకుడు సంపత్ నంది కూడా గోపీచంద్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా మొద్దలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :