
గోపీచంద్ హీరోగా రాధాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ హిట్ సినిమాల బ్యానర్ యూవీ క్రియేషన్స్ రూపొందించిన చిత్రం.. ‘జిల్’. రాశిఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ఈ సాయంత్రం పూర్తి చేసుకుంది. పూర్తి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బృందం రెండు ప్రతిపాదనలు తెచ్చింది. కొన్ని సన్నివేశాలకు కట్ చెప్పి ‘యూ/ఏ’ రేటింగ్ ఇవ్వడం ఒకటి కాగా, వాటిని అలాగే ఉంచి ‘ఏ’ రేటింగ్ ఇవ్వడం మరొకటి. నిర్మాతలు ఏదో ఒక ప్రదిపాదన ఓకే చెప్పే పనిలో ఉన్నారు.
ఇక అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈనెల 27న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమా పట్ల ఇటు ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ మధ్యనే విడుదలైన జిల్ ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా యూత్ గిబ్బన్ మ్యూజిక్‌లోని కొత్తదనానికి పూర్తి మార్కులు వేశారు. గోపీచంద్ గత చిత్రమైన లౌక్యం మంచి విజయాన్ని సాధించడం ఈ సినిమా బిజినెస్ రేంజ్ పెరిగేలా చేసింది. ట్రైలర్, పాటలు అన్నీ స్టైలిష్‌గా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాతో గోపీచంద్ మరో హిట్ కొడతాడా? అన్నది చూడాలి.

