మళ్లీ రెడీ అవుతున్న యాక్షన్ హీరో !

మళ్లీ రెడీ అవుతున్న యాక్షన్ హీరో !

Published on Feb 26, 2019 6:01 PM IST

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్.. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే జైపూర్ దగ్గర మాండవలో బైక్ చేజింగ్ పోరాట సన్నవేశాలు చిత్రీకరణ జరుపుకుంటుండంగా బైక్ స్కిడ్ అయి గోపీచంద్ కి స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే.

కాగా గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న గోపీచంద్ మిగిలిన చిత్రీకరణ కోసం షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18 గా అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకి సాంకేతిక నిపుణులు : కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం : తిరు, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రచయిత: అబ్బూరి రవి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు