థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ‘చాణక్య‌` !

Published on Jun 9, 2019 6:30 pm IST

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్ల‌ర్ చిత్రానికి `చాణక్య‌` అనే టైటిల్‌ ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఈ రోజు ద‌ర్శ‌క నిర్మాత‌లు విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు తిరు.. గోపీచంద్‌ను స‌రికొత్త పంథాలో చూపిస్తూ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారట. ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన మెహరీన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ జ‌రీనా ఖాన్ కూడా కీల‌క పాత్ర‌లో నటిస్తోంది. 50 శాతానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుత షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది.

కాగా సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అబ్బూరి రవి రచన చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More