యాక్షన్ హీరో సినిమాలో కామెడీ సీక్వెన్స్ హైలెట్ అంటా !

యాక్షన్ హీరో సినిమాలో కామెడీ సీక్వెన్స్ హైలెట్ అంటా !

Published on Feb 22, 2019 9:05 AM IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతున్న విషయం తెలిసందే. గోపీచంద్ కోసం సంపంత్ నంది ఓ మంచి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కెనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో గోపీచంద్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. సినిమా మొత్తం మీద గోపిచంద్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని సమాచారం. ఆ పాత్రలోని వేరియేషన్స్ కారణంగా ఓ కామెడీ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తోందట.

ఇక గోపీచంద్ లాస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లౌక్యం’, మళ్లీ ఇన్నాళ్ళకు మరో ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. మరి ‘లౌక్యం’ లాగే ఈ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు