‘చాణక్య’ ఫస్ట్ లుక్: టార్గెట్ పై ఫోకస్ పెట్టిన గోపిచంద్

Published on Jun 12, 2019 3:03 pm IST

హీరో గోపీచంద్ తాజా మూవీ “చాణక్య” ఫస్ట్ లుక్ ను ముందుగా ప్రకటించినట్లే కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ విడుదల చేశారు. హీరో గోపిచంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది. కిక్కిరిసిన ఓ ముస్లిం స్ట్రీట్లో తన టార్గెట్ కేసి అలాగే తీక్షణంగా చూస్తున్న గోపిచంద్ ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ గా ఉంది.

పెరిగిన గడ్డం,మెడలో మఫ్లర్ తో గోపి చంద్ ఫుల్ మాస్ గా కనిపిస్తున్నారు. దర్శకుడు తిరు ఈ మూవీని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

‘చాణక్య’లో గోపి చంద్ సరసన మెహ్రీన్,జరీనా ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, ఏ కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ స్వరాలూ సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More