సింగ : మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న మ్యాచో స్టార్ గోపీచంద్..!

సింగ : మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న మ్యాచో స్టార్ గోపీచంద్..!

Published on Jun 12, 2026 7:00 PM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ నేడు(జూన్ 12) తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు తన నెక్స్ట్ చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే ‘భరతవర్ష’ మూవీ నుండి బర్త్ డే పోస్టర్ రిలీజ్ కాగా, తాజాగా గోపీచంద్ నటిస్తున్న 34వ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతుండగా ఈ చిత్రానికి ‘సింగ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్‌లో గోపీచంద్ పూర్తి రా అండ్ రస్టిక్ అవతారంలో ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడు. ఈ గ్లింప్స్ చూస్తుంటే, ఇది పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు