యాక్షన్ హీరో సినిమాలో ‘కామెడీ హీరో’ ?

Published on Feb 10, 2019 7:25 pm IST

సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఓ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న విషయం తెలిసందే. గోపీచంద్ కోసం సంపంత్ నంది ఓ మంచి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారట. గోపిచంద్ కి కూడా సంపత్ చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చిందట. అందుకే వెంటనే సినిమాని పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాలో గోపీచంద్ తో మరో ముఖ్యపాత్ర కూడా ఉందట. సినిమా మొత్తం ఉండే ఆ పాత్ర, సునీల్ చేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మార్చి నుంచి ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అధికారికంగా ప్రారంభం కానుంది.

నిజానికి గోపీచంద్ చేసిన లాస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లౌక్యం’. ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లోనే మంచి హిట్ చిత్రంలా నిలిచింది. మళ్లీ ఇన్నాళ్ళకు గోపీచంద్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి సంపత్, గోపీచంద్ కి హిట్ ఇస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :