గోపీచంద్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్

గోపీచంద్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్

Published on Jun 11, 2014 10:00 PM IST

gopi
టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ త్వరలో పలు ప్రాజెక్ట్ లలో కనిపించనున్నాడు. ప్రస్తుతం గోపీ చేతిలో మూడు సినిమాలు వున్నాయి. అవన్నీ వివిధ దశలో వున్నాయి

ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో భావ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలచేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది

ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం ముగిసింది. సెప్టెంబర్ చివరికి ఈ సినిమాను విడుదలచెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్

ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ ఏమిటంటే సాగర్ మహతి అనే సంగీతదర్శకుడు పరిచయంకానున్నాడు. ఈ యువకుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు

తాజా వార్తలు