కామెడీ స్టార్స్ జాతరలో గోరటి వెంకన్న ధూంధాం స్టెప్పులు..!

కామెడీ స్టార్స్ జాతరలో గోరటి వెంకన్న ధూంధాం స్టెప్పులు..!

Published on Aug 4, 2021 11:25 PM IST

ప్రముఖ పాటల రచయిత, కవి,గాయకుడు గోరటి వెంకన్న గురుంచి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గుక్కతిప్పుకోకుండా ఆయన పాడిన పాటలు వింటే చాలు ఎక్కడలేని ఉత్సాహం, ఉత్తేజం మనలో కలుగుతుంటుంది. అయితే ఆ ఉత్సాహాన్ని స్టార్ మా వారు ఈ ఆదివారం బుల్లితెర ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ ఆదివారం ఎంటెర్‌టైన్‌మెంట్ జాతరగా జరగనున్న “కామెడీ స్టార్స్” కార్యక్రమానికి గోరటి వెంకన్న అతిధిగా వచ్చారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ప్రోమోను విడుదల చేశారు.

అయితే ఎప్పటిలాగానే ఇందులోని కంటెస్టెంట్లు తమ తమ కామెడీ స్కిట్లతో నవ్వులు పూయించరు. పక్కా లోకల్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ స్టెప్పులు వేశారు. ఇక గోరటి వెంకన్న కూడా తాను పాడిన జానపదానికి తనదైన శైలిలో ధూంధాం స్టెప్పులేయడం ఆకట్టుకుంది. మరీ ఈ ఫుల్ టూ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ ఎపిసోడ్‌ను మిస్ కాకుడదంటే ఈ ఆదివారం 1:30 గంటలకు స్టార్ మాలో వచ్చే “కామెడీ స్టార్స్”ని తప్పక చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు