‘చెర్రీ15’కి భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్న శంకర్..నిజమెంత?

Published on Jul 8, 2021 7:04 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు విజనరీ డైరెక్టర్ శంకర్ ల కాంబోలో ఓ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ బేస్డ్ డ్రామా ఇంకొన్ని నెలల్లో పట్టాలెక్కనుంది. అయితే భారీతనానికి హుందాతనం కనబరిచే సినిమాలకు శంకర్ కేరాఫ్ అడ్రెస్ సో తన సినిమాలకి భారీ మొత్తంలోనే ఖర్చు అవుతుంది.

అలాగే అలాంటి సబ్జెక్ట్ లను హ్యాండిల్ చేస్తారు కాబట్టే శంకర్ కి కూడా రెమ్యునరేషన్ ముట్టుతుంది అని తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ తో చేస్తున్న 15వ సినిమాకి తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ సినిమాకి తీసుకుంటున్నారని అది కూడా 60 కోట్లకు పైమాటే అని ఓ టాక్ వైరల్ అవుతుంది. అయితే వాస్తవానికి మాత్రం ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. 60 కోట్ల లోపే శంకర్ రెమ్యునరేషన్ ఉందని అసలైన టాక్. సో ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :