“కేజీయఫ్ 2” కు యష్ రెమ్యునరేషన్ పై లేటెస్ట్ గాసిప్స్.!

Published on Jan 23, 2021 3:35 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ ఆక్షన్ థ్రిల్లర్ చిత్రంపై తారా స్థాయి అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. మరి అదే విధంగా ఈ సినిమా టీజర్ కు కూడా భారీ స్థాయి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా బడ్జెట్ మరియు కొన్ని సీన్స్ కు గాను ఎంత ఖర్చు అయ్యిందో లెక్కలు బయటకొచ్చాయి. అలా ఇప్పుడు ఈ సినిమా మెయిన్ లీడ్ యష్ కు ఎంత రెమ్యునేషన్ ను కేజీయఫ్ మేకర్స్ హోంబలె నిర్మాణ సంస్థ వారు ముట్టజెప్పారో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు గాను యష్ 30 నుంచి 35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట.

అంతే కాకుండా ఈ సినిమాకు వచ్చే లాభాల్లో కూడా షేర్ ఉందని సినీ వర్గాల్లో ఇపుడు చర్చ నడుస్తుంది. అయితే ఈ సాలిడ్ సినిమాకు ఈ రెమ్యునరేషన్ తక్కువే అనిపించినా బడ్జెట్ కూడా పెద్దగా అవ్వలేదు కాబట్టి ఓకే అని చెప్పొచ్చు. కానీ పొరపాటున కానీ హిట్ టాక్ వస్తే మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కాసుల వర్షం ఊహలకు కూడా అందకపోవచ్చు. మరి ఆ లెక్కన యష్ కు గట్టి లాభాలే వస్తాయి.

సంబంధిత సమాచారం :

More