టాలెంటెడ్ డైరెక్టర్ తో బన్నీ యాక్షన్ మూవీ !

Published on Jul 25, 2021 11:37 pm IST

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నానితో ‘జెర్సీ’ చిత్రం చేసి.. అదే సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం గౌతమ్ తిన్ననూరి తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడని.. ఇప్పటికే బన్నీకి కూడా కథ చెప్పాడని తెలుస్తోంది. అయితే గౌతమ్ కథలో బన్నీ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

మరి, గౌతమ్ ఆ మార్పులు పూర్తి చేసుకుని వెళ్లినా.. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో రాదు అట. 2022లో వీరి సినిమా మొదలవుతుందట. కాగా ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని టాక్. ఎలాగూ గౌతమ్, బన్నీ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి.

పైగా గౌతమ్ లాస్ట్ మూవీ ‘జెర్సీ’ సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది. సో.. బన్నీతో చేయబోయే సినిమా పై భారీ ఎక్స్ పెటేషన్స్ ఉంటాయి.

సంబంధిత సమాచారం :