‘గౌతమిపుత్ర..’ ఆంధ్రా హక్కులు ఎంత పలికాయంటే!

Gautamiputra-Satakarnigau
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి బయటకొస్తోన్న నంబర్స్ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆంధ్రా ప్రాంతం మొత్తం కలుపుకొని ఈ సినిమా 21 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందట.

ట్రైలర్, టీజర్ అన్నీ ఆకట్టుకునేలా ఉండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ తీసుకురావడంతో సాధారణంగానే సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తాలను పెట్టారు. విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శాతకర్ణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ఉన్న సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా ఇప్పటికే జోరందుకున్నాయి.