సినీ నటుడు శివప్రసాద్‌ పై వందతులు నమ్మవద్దు !

Published on Sep 20, 2019 9:05 pm IST

సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు నారమల్లి శివప్రసాద్‌ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుతున్నారు.. అయితే ఆయన మరణించినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే ఈ విషయం పై శివప్రసాద్ గారి మనవడును వివరణ కోరగా తనే స్వయంగా ఈ కింద వీడియోని తీసి తద్వారా వారి తాత గారి ఆరోగ్య పరిస్థితిని వివరించి పంపించడం జరిగింది. శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నదని వెల్లడించారు. అధికారికంగా తాము ప్రకటించే వరకూ వందతులను నమ్మవద్దని ఆయన కోరారు.

కాగా ప్రత్యేక హోదా ఉద్యమంలో తనదైన ప్రత్యేక శైలితో శివ ప్రసాద్‌ ఆకట్టున్నారు. శివప్రసాద్ 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. ఇక అరోగ్యం సహకరించకపోవడంతో కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. శివప్రసాద్ రాజకీయ రంగం మాత్రమే కాదు.. సినిమాల్లోనూ రాణించారు. ఆయన ఎన్నో సినిమాల్లో మంచి పాత్రల్లో నటించారు. మొదట తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ గా నటించిన ఈయన.. క్రమంగా ఎదుగుతూ 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌ గా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఈయన నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. శివప్రసాద్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2Fhydmovies%2Fstatus%2F1175070812535050240&widget=Tweet

సంబంధిత సమాచారం :

X
More