బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ పై క్రేజ్ పీక్స్ లో ఉందిగా..!

Published on Dec 10, 2019 7:06 am IST

సాధారణంగా ఓ సినిమా విడుదలవుతుందంటే హిట్ అవుతుందా…లేక ఫెయిల్ అవుతుందా అని మాట్లాడుకుంటారు. కానీ రాజమౌళి సినిమా విడుదలవుతుందంటే రికార్డుల గురించి మాట్లాడుకుంటారు. ప్రతి పెద్ద సినిమా ఫలితాన్ని రాజమౌళి రికార్డులను ప్రామాణికంగా తీసుకొని లెక్కలు వేసుకుంటారు. ఒక దర్శకుడిగా రాజమౌళి నెలకొల్పిన రికార్డులు అలాంటివి మరి. ఇక బాహుబలి చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన రాజమౌళి ఎవరూ అందుకోలేనంత స్థాయికి ఎదిగారు.

ఇక ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ పై కూడా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా మూవీగా అనేక భాషలో విడుదల కానుంది. ఐతే ఈ చిత్ర హిందీ వర్షన్ విడుదల హక్కుల కొరకు ఇప్పటికే అక్కడి బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీపడుతున్నాయట. యష్ రాజ్ ఫిలిమ్స్, టి సిరీస్, ఎరోస్ వంటి అనేక డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టాయని సమాచారం. బాహుబలి చిత్రాన్ని దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాజమౌళి ఈసారి కూడా మరి వారికే ఆర్ ఆర్ ఆర్ హిందీ హక్కులు కట్టబెడతారా లేక వేరే సంస్థను ఎంచుకుంటారా అనేది చూడాలి. ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More