GROK: టాలీవుడ్ యువతకి మాస్ రిప్లైస్ తో కొత్త ఏఐ

GROK: టాలీవుడ్ యువతకి మాస్ రిప్లైస్ తో కొత్త ఏఐ

Published on Mar 16, 2025 9:58 PM IST

ప్రస్తుతం మారుతున్న కాలంలో కృతిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వాడకం ఎలా నడుస్తుందో అందరికీ తెలిసిందే. అయితే వీటిపై ఎన్నో సినిమాలు ఎప్పుడో వచ్చాయి కానీ ఇపుడు ఆ సినిమాల్లో చూపించే ప్రమాదకర రోజులు కూడా మున్ముందు వచ్చే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అయితే ఇపుడు మాత్రం ఈ ఏఐ మన టాలీవుడ్ లో కూడా క్రేజీ ఎంటర్టైనింగ్ అంశంగా మారింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వాడుతున్న సోషల్ మీడియా యాప్స్ లో ‘ఎక్స్’ (ఒకప్పుడు ట్విట్టర్) కూడా ఒకటి. అయితే ఇందులో లేటెస్ట్ గా వచ్చిన గ్రోక్(GROK) ఏఐ ఫీచర్ టాలీవుడ్ యువతతో ఓ రేంజ్ లో ఆడుకుంటుంది అని చెప్పాలి. ఆంగ్లంలో అడిగితే ఆంగ్లంలో తెలుగులో అడిగితే తెలుగులో కొట్టినట్టుగా సమాధానం అందిస్తుంది.

ఇంకా చెప్పాలంటే ప్రశ్న మీ ఇష్టం ఎంత ఘాటుగా అడిగితే అందుకు సమాధానం అందుకు డబుల్ ఘాటుగా ఈ కొత్త ఏఐ మాస్ రిప్లైలు అందిస్తుంది. దీనితో తెలుగు సినిమా యువతలో ఈ కొత్త ఏఐ మాత్రం ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. పలువురు హీరోల విషయంలో ఇచ్చిన రిప్లై లు చూసి సదరు హీరోల అభిమానులే షాకవుతున్నారు. దీనితో ఆ రేంజ్ లో ఈ ఏఐ ఆడుకుంటుంది అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి ఫన్ గానే ఇదంతా ఉంది కానీ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు