“గుమ్మడి నర్సయ్య” బయోపిక్ టైటిల్ లోగో విడుదల చేసిన సుకుమార్..!

“గుమ్మడి నర్సయ్య” బయోపిక్ టైటిల్ లోగో విడుదల చేసిన సుకుమార్..!

Published on Jul 30, 2021 11:08 AM IST

Gummadi

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురుంచి పెద్దగా పరిచయం చెప్పక్కర్లేదు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా కూడా ఆయన సాదా సీదా జీవితాన్ని గడిపేవాడు. శాసనసభకు బస్సులో, ఆటోలో వచ్చే నిరాడంబరమైన మనిషి. ఆస్తులు కూడగట్టుకోలేదు, అవినీతికి పాల్పడలేదు, ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న నిక్కార్సైన వ్యక్తిత్వం ఆయనది. ఇలాంటి ఆదర్శవంతమైన నాయకుడి జీవితగాధ ఆధారంగా పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నాడు.

అయితే తాజాగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. అనంతరం సుకుమార్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈతరంతో పాటు రాబోయే తరాల ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిసేలా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఉండబోతోందని, త్వరలోనే చిత్రానికి సంబందించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తామని చిత్రబృందం తెలిపింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు