“గుణ 369” ట్రైలర్ డేట్ ఫిక్సయింది

Published on Jul 16, 2019 11:13 am IST

యంగ్ హీరో కార్తికేయ,అనఘా హీరో హీరోయిన్లుగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” గుణ369″. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తిరుమల రెడ్డి,అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజులక్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి ఆదరణ లభించింది. ఐతే నేడు చిత్ర యూనిట్ “గుణ 369” ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడం జరిగింది.

రేపు ఉదయం 11 గంటల 11నిమిషాలకు ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనునున్నారు. ఈమేరకు చిత్ర యూనిట్ ఓ ట్రైలర్ రిలీజ్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. సాయి కుమార్,ఆదిత్య మీనన్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 2న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More