రానా భారీ పౌరాణిక చిత్రానికి రంగం సిద్ధం…?

Published on Nov 8, 2019 7:03 am IST

టాలీవుడ్ లో భారీ చిత్రాల దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఈ సీనియర్ దర్శకుడు తన కెరీర్ లో చూడాలనిఉంది, ఒక్కడు, రుద్రమదేవి వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. 1992లో వచ్చిన లాఠీ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి ప్రవేశించిన గుణశేఖర్ 27ఏళ్ల కెరీర్ చేసింది కేవలం 13చిత్రాలే. ఆచితూచి సినిమాలు చేసే ఈయన ఒక మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులకొరకే ఏళ్ల సమయం తీసుకుంటాడు.

2015లో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ మూవీ రుద్రమదేవి ఈయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం. కాగా ఈ భారీ చిత్రాల దర్శకుడు కొద్దినెలల క్రితం దగ్గుబాటి రానా హీరోగా ‘హిరణ్యకశిప’ అనే పౌరాణిక చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఐతే ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సహాయ దర్శకులు మరియు, తెలుగు భాష, సాహిత్యం అవగాహన ఉన్నవారు సంప్రదించవలసినదిగా ట్విట్టర్ వేదికగా గుణశేఖర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. కాబట్టి రానా తో చేయనున్న హిరణ్య కశిప చిత్రం కోసమే ఈ ప్రకటన అని తెలిసిపోతుంది. కాబట్టి గుణశేఖర్-రానా కాంబినేషన్లో హిరణ్యకశిప త్వరలోనే కార్యరూపం దాల్చనుందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More