మరోసారి ‘గుండెజారి’ కాంబినేషన్ రిపీట్ కానుంది !

Published on Mar 20, 2019 4:54 pm IST

విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నితీన్ నటించిన చిత్రం గుండెజారి గల్లంతయ్యిందే. ‘ఇష్క్’ తరువాత నితిన్ కు మరో సూపర్ హిట్ ను ఇచ్చింది ఈ చిత్రం. ఇక ఇప్పుడూ ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇటీవలే విజయ్ , నితిన్ ను కలిసి స్టోరీ వినిపించాడట. ఆ స్టోరీ నచ్చడంతో నితీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈనెల చివర్లో ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది.

ఇక నితీన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తో భీష్మ అనే చిత్రాన్ని చేయనున్నాడు. అయితే ఇంతవరకు ఈ సినిమా గురించి అధికారకంగా ఎలాంటి అప్డేట్ వెలుబడలేదు.

సంబంధిత సమాచారం :