నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ‘గుంటూరు కారం’

నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ‘గుంటూరు కారం’

Published on Feb 11, 2024 2:00 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే ఒకింత మిశ్రమ స్పందన సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుని మొత్తంగా పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అందుకుంది.

విషయం ఏమిటంటే, రెండు రోజుల క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అందరినీ అలరిస్తూ ప్రస్తుతం ఆ ఓటిటి లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. గుంటూరు కారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కి అందరి నుండి విశేషమైన రెస్పాన్స్ లభించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలోని సాంగ్స్, ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి, మావా ఎంతైనా సాంగ్స్ సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు