‘గుంటూరు కారం’ : బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

‘గుంటూరు కారం’ : బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

Published on Mar 29, 2024 6:50 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు.

ఇక ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా ముఖ్యంగా మాస్ సాంగ్ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్ కి అందరి నుండి విశేషమైన స్పందన లభించింది. ఈ సాంగ్ లో థమన్ అందించిన మాస్ బీట్స్ కి మహేష్, శ్రీలీల ఇద్దరూ కూడా తమ పవర్ఫుల్ డ్యాన్స్ మోమెంట్స్ తో అదరగొట్టారు. విషయం ఏమిటంటే, ప్రస్తుతం కుర్చీ మడతపెట్టి సాంగ్ వీడియో 150 మిలియన్స్ పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో కొనసాగుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సాంగ్ ఇంకెంతమేర రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు