గుర్తుందా శీతాకాలం ఈ జనరేషన్ గీతాంజలి – హీరో సత్యదేవ్

గుర్తుందా శీతాకాలం ఈ జనరేషన్ గీతాంజలి – హీరో సత్యదేవ్

Published on Dec 3, 2022 11:54 PM IST


విలక్షణ నటుడు సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్స్ గా మేఘ ఆకాష్ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ గుర్తుందా శీతాకాలం. కన్నడ నటుడు మరియు డైరెక్టర్ అయిన నాగశేఖర్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్సించ‌గా కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు, ఇక ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని నేడు లాంచ్ చేసి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అందులో భాగంగా దర్శకుడు నాగ శేఖర్ మాట్లాడుతూ, ఇది నా డెబ్యూ మూవీ, ఈ అవకాశం నాకు కల్పించినందుకు థాంక్యూ. ముఖ్యంగా నేను ఎక్కడికి వెళ్లినా ఈ టైటిల్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. నిజానికి ఈ క్రెడిట్ హీరో సత్యదేవ్ గారికే ఇవ్వాలి. డిశంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న మా గుర్తుందా శీతాకాలం మూవీ తప్పకుండా మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను అన్నారు. అనంతరం హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ఈ సినిమాలో మొత్తం నాలుగు డిఫెరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి.

ఈ సినిమా ఫోర్ ఫేజ్ స్ అఫ్ లైఫ్. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఇది తప్పకుండా మెప్పిస్తుంది. ఈ నాలుగు ఫేజెస్ అయిపోయినవాళ్లు, అలానే ప్రెజెంట్ ఆ ఫెజ్ రన్ అయ్యేవాళ్ళు ఉంటారు. నిజానికి అన్ని సెక్షన్స్ కి ఇంతకంటే బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఎవరు చేయలేరేమో అని నా అభిప్రాయం. ఇక ఈ సినిమాని భూపాల అన్న రాసేసి డైలాగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా నవ్వుతూనే ఉన్నాం. ఈ సినిమా విన్నపుడు ఎలా ఫీల్ అయ్యామో సినిమాను కూడా అదే ఫీల్ తో తెరకెక్కించారు నాగశేఖర్ అన్న. ఇక ఈ జనరేషన్ కి ఒక గీతాంజలి లేదు, మా గుర్తుందా శీతాకాలం మూవీనే ఈ జనరేషన్ వారికి గీతాంజలి అన్నట్లు ఈ సినిమాను చేసారు మా డైరెక్టర్. ఈ సినిమాలో నటించిన తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. అలానే ప్రతి ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ కి ప్రత్యేకంగా థాంక్స్ అంటూ మాట్లాడారు సత్యదేవ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు