లాస్ట్ నైట్ పార్టీలో ‘ఇస్మాట్ శంకర్’ !

Published on Mar 25, 2019 11:17 am IST

ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మాట్ శంకర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే లాస్ట్ నైట్ చిత్రబృందం ఫుల్ పార్టీ చేసుకుందని.. పార్టీలో డాన్స్ చేసినట్లు ‘ఇస్మాట్ శంకర్’ మరియు రొమాంటిక్ చిత్రాల సాంగ్స్ కి కూడా అంత బాగా చేయలేదని.. ప్రత్యేకంగా రామ్ అద్భుతంగా డాన్స్ చేసాడని తన ట్వీటర్పో వేదికగా తెలిపింది ఛార్మి.

ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరూ హీరోయిన్స్ గా నటిస్తోన్నారు. ఇందులో నభా నటేష్ క్యారెక్టర్ వినూత్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే పూరి మాములుగా తన సినిమాల్లో హీరోలకు రాసే క్యారెక్టరైజేషన్ ను ఈ సారి హీరోయిన్ కి రాశాడట.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More