బిజీ బిజీగా హన్సిక “మై నేమ్ ఈజ్ శృతి”.!

బిజీ బిజీగా హన్సిక “మై నేమ్ ఈజ్ శృతి”.!

Published on Jul 31, 2021 5:08 PM IST


స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్ హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజే స్తూ ‘బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్‌ థ్ల్రిలర్‌ని ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిది.

ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం.ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం’ అన్నారు. మురళీశర్మ, జయప్రకాష్‌, ఆడుకాలం నరెన్‌, రాజా రవీంద్ర, సీవీఎల్‌ వినోదిని, సాయితేజ్‌ కాల్వకోట, మహేష్‌ తదితరులు నటిస్నున్న చిత్రంలో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి కెమెరా: కిషోర్‌ బోయిడపు, సంగీతం: మార్క్‌.కె.రాబిన్‌, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్‌, ఆర్ట్‌: గోవింద్‌ ఇరసాని, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బరావు గూడపాకల, లైన్ ప్రొడ్యూసర్‌: కె.విజయ్‌కుమార్‌, సహ నిర్మాతలు: పవన్‌కుమార్‌ బండి, ఎజీ ఎలియస్‌, రచన-దర్శకత్వం: శ్రీనివాస్‌ ఓంకార్‌ వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు