ఆయనతో ఫోటో పంచుకుని.. నో క్యాప్షన్ అంటున్న హన్సిక

Published on Feb 25, 2020 9:40 pm IST

పదహారేళ్లు కూడా నిండకుండా హన్సిక ను హీరోయిన్ గా పరిచయం చేశాడు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ పక్కన హన్సిక మొదటిసారి హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత తెలుగులో వరుసగా చాల సినిమాలు చేసింది. కొన్నాళ్లుగా తమిళ పరిశ్రమలో బిజీగా గడుపుతున్న హన్సిక గత ఏడాది హీరో సందీప్ కిషన్ కి జంటగా తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ సినిమాలో నటించింది. ఇన్నోసెంట్ లేడీ లాయర్ గా ఆమె నటించి అలరించింది.

కాగా ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో క్రికెట్ లెజెండ్ సచిన్ తో దిగిన ఫోటో పంచుకుంది. అలాగే ఈ ఫోటోకి క్యాప్షన్ అవసరం లేదు , అద్భుతమైన అనుభూతి అన్నట్లు ఓ మెస్సేజ్ కూడా పోస్ట్ చేసింది. తెలుగులో అవకాశాలు కనుమరుగైన హన్సిక తమిళంలో ఓ హారర్ థ్రిల్లర్ చేస్తుంది.

సంబంధిత సమాచారం :