మరో లేడీ ఓరియెంటెడ్ కి ఓకే చెప్పిన హన్సిక !

Published on May 5, 2019 8:19 pm IST

కోలీవుడ్ లో హన్సిక నటించిన తాజా చిత్రం 100 ఈనెల 9న విడుదలకానుంది. ఇక ఈ సినిమా కాకుండా ప్రస్తుతం హన్సిక ‘మహా’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఇది ఆమెకు 50వ సినిమా. ఈ చిత్రం తమిళ్ తోపాటు తెలుగులో ను విడుదలకానుంది. ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

ఇటీవల జ్యోతిక తో జాక్ పాట్ అనే చిత్రాన్ని తెరక్కించిన దర్శకుడు కళ్యాణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :

More