సమీక్ష : “హను మాన్” – మెప్పించే మన సూపర్ హీరో యాక్షన్ డ్రామా

సమీక్ష : “హను మాన్” – మెప్పించే మన సూపర్ హీరో యాక్షన్ డ్రామా

Published on Jan 13, 2024 2:09 AM IST
Hanu Man Movie Review in Telugu

విడుదల తేదీ : జనవరి 12, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య

దర్శకుడు : ప్రశాంత్ వర్మ

నిర్మాత: నిరంజన్ రెడ్డి

సంగీత దర్శకులు: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్

సినిమాటోగ్రఫీ: శివేంద్ర

ఎడిటింగ్: సాయిబాబు తలారి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ కొత్త ఏడాదిలో మన టాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఎదురు చూస్తున్న చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ చిత్రం “హను మాన్” కూడా ఒకటి. భారీ బుకింగ్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే..ఒక ఫిక్షనల్ సిటీ సౌర్యస్త్ర ప్రాంతానికి చెందిన మైఖేల్(వినయ్ రాయ్) తన చిన్ననాటి నుంచి సూపర్ హీరోస్ విషయంలో చాలా ప్రభావవంతం అయ్యి తాను కూడా ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. ఇక మరో పక్క అంజనాద్రి అనే ఓ చిన్న కుగ్రామం లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తిరిగే తుంటరి కుర్రాడు హనుమంతు(తేజ సజ్జ) కొన్ని పరిణామాల రీత్యా భజరంగ్ హనుమాన్ శక్తులని పొందుతాడు. మరి తాను ఈ శక్తిని ఎలా పొందగలిగాడు? అసలు ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యి ఉంది? మరి ఈ శక్తి కోసం మైఖేల్ ఎలా తెలుసుకొని వస్తాడు? వస్తే అప్పుడు యుద్ధం ఎలా ఉంటుంది ఈ అంతటికీ భారతదేశ ఇతిహాసాల కనెక్షన్ ఎలా ఉంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో అందరికీ తెలిసిన అతి పెద్ద మేజర్ ప్లస్ పాయింట్ హనుమంతుడే ఆ ఫ్యాక్టర్ ని సినిమాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎలా హైలైట్ చేయాలో అలా చేసి చూపించాడు. హీరో తేజ సజ్జ అయితే తన రోల్ కి కంప్లీట్ ప్రాణం పెట్టేసాడు. తన రోల్ ని చాలా ఈజ్ గా బాధ్యతగా చేసి చూపించాడు అలాగే తన లుక్స్ కానీ కామెడీ టైమింగ్ గాని యాక్షన్ పార్ట్ సహా ఎమోషనల్ పెర్ఫెమెన్స్ లతో కూడా అదరగొట్టాడు.

ఇక హీరోయిన్ అమృత అయ్యర్ కి కూడా ఈ చిత్రంలో మంచి పాత్ర చేసింది. హీరోతో ట్రావెల్ చేస్తూ బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంది. వీరితో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్ చాలా పవర్ఫుల్ రోల్ లో కనిపించారు. చాలా నాచురల్ పెర్ఫామెన్స్ కనబరిచింది. మెయిన్ గా తేజతో ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరి పెర్ఫామెన్స్ లు ఆకట్టుకుంటాయి.

ఇక వీరితో పాటుగా వెర్సటైల్ నటుడు సముద్రఖని రోల్ అయితే సినిమాలో ఆశ్చర్యపరుస్తుంది. తన రోల్ లో కూడా తాను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇంకా విలన్ గా వినయ్ రాయ్ కూడా క్లీన్ గా కనిపిస్తారు. ఇంకా వీరితో పాటుగా గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య వారిపై కామెడీలు హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి.

ఇక వీటి అన్నిటిని మించి సినిమాలో రోమాలు నిక్కబొడుచునే సీన్స్ చాలా ఉన్నాయి. ఫస్టాఫ్ సెకండాఫ్ లో కూడా చాలా హై మూమెంట్స్ అదరగొడతాయి. ఇక టోటల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే మరో బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పడంలో సందేహం లేదు ఇదైతే డెఫినెట్ లో బిగ్ స్క్రీన్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన అంశం.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కొన్ని లోటు పాట్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రాన్ని మన తెలుగు సూపర్ హీరోగా ప్రెజెంట్ చేసినప్పటికీ కొన్ని సీక్వెన్స్ లు కాస్త రెగ్యులర్ గానే అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్రలో వినయ్ పాత్రని ఇంకా పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయాల్సింది. అలాగే తన పాత్రని మరికాస్త డీటెయిల్డ్ గా ప్రెజెంట్ చేయాల్సింది. తన పాత్రతో పాటుగా సినిమాలో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి.

ఇంకా చాలా సీన్స్ ని మరింత బెటర్ గా వి ఎఫ్ ఎక్స్ ని డిజైన్ చేయాల్సింది. ఇంకా సినిమాలో ప్లాట్ కానీ కొన్ని సీక్వెన్స్ లు కానీ మనం ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా సినిమా కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో కూడా కొంచెం స్టార్టింగ్ అయితే స్లోగా అనిపిస్తుంది కానీ తర్వాత ఓకే అనిపిస్తుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో కొంచెం నాచురాలిటీ మిస్ అయ్యింది వీటితో ఒక కంప్లీట్ సూపర్ హీరో సినిమా చూస్తున్నట్టుగా అనిపించదు.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. పెట్టిన బడ్జెట్ కి అయితే చాలా వరకు న్యాయమైన విజువల్స్ కనిపించాయి. ఒక్క వి ఎఫ్ ఎక్స్ మినహా మిగతా అన్ని క్రాఫ్ట్స్ లో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. వి ఎఫ్ ఎక్స్ చాలా చోట్ల చాలా నాచురల్ గా చూపించారు కానీ కొన్ని చోట్ల బడ్జెట్ మూలాన కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. శివేంద్ర సినిమాటోగ్రఫి బాగుంది. భారీ విజువల్స్ ని తాను చూపించారు.

ఇక గౌరీ హరీష్ సంగీతం సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెయిన్ గా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాకి వెన్నుముకగా నిలిచాడు. ఈ తరహా చిత్రాల్లో రాజమౌళికి కీరవాణి సంగీతం అందిస్తే ఎలా ఉంటుందో అలాగే ప్రశాంత్ వర్మకి గౌరీ హరీష్ అనే లెవెల్లో ఉంది. ఇంకా ఎడిటింగ్, డైలాగ్స్ బాగున్నాయి.

ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ విషయానికి వస్తే తన విజన్ కి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాకపోతే సూపర్ హీరో జానర్ అయినప్పటికీ కొన్ని సీన్స్ ని మనం ఆల్రెడీ చూసినవే చూపించాడు. కానీ ఇక్కడ తాను ప్రస్తుత కాలానికి మన ఇతిహాసాన్ని జోడించడంలో మాత్రం తాను సూపర్ సక్సెస్ అయ్యాడు.

హనుమాన్ ఫ్యాక్టర్ ని ఎలివేషన్స్ ని క్లైమాక్స్ పోర్షన్ ని తాను ప్రెజెంట్ చేసిన విధానం చూస్తే రానున్న రోజుల్లో తన సినిమాలకి మరింత బడ్జెట్ ఇస్తే ఇంకా సాలిడ్ విజువల్స్ ఇస్తాడని చెప్పవచ్చు. కానీ ఇంకా కొన్ని లాజిక్స్ ని కరెక్ట్ చేసుకొని యాక్షన్ సీక్వెన్స్ లను మరింత నాచురల్ గా ప్రెజెంట్ చేయాల్సింది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే మన తెలుగు నుంచి వచ్చిన ఈ మొదటి సూపర్ హీరో చిత్రం “హను మాన్” పెట్టుకున్న అంచనాలు రీచ్ అయ్యింది అని చెప్పవచ్చు. మెయిన్ లీడ్ లో ఉన్న నటీనటులు అంతా కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ లు కనబరిచారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫ్యాక్టర్ ని ప్రెజెంట్ చేసిన విధానం, మన ఇతిహాసాన్ని జోడించడం ఇంప్రెస్ చేస్తుంది. కొన్ని లాజిక్స్ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ని పక్కన పెడితే ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా అందరికీ మంచి ట్రీట్ ఇస్తుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు