ఓటిటి లో 4కె లో అందుబాటులోకి వచ్చిన ‘హను మాన్’

ఓటిటి లో 4కె లో అందుబాటులోకి వచ్చిన ‘హను మాన్’

Published on Mar 21, 2024 10:00 PM IST

తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హను మాన్. ఈమూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై నిరంజన్ రెడ్డి నిర్మించగా కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు.

ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి అతి పెద్ద సెన్సేషన్ సృష్టించిన హను మాన్ మూవీ తాజాగా జీ 5 ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. విషయం ఏమిటంటే, తాజాగా ఓటిటిలో ఈమూవీ 4కె వర్షన్ కూడా అంబాటులోకి వచ్చిందని జీ 5 వారు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు. ఆ విధంగా మరింత క్వాలిటీతో హను మాన్ ని ఎంజాయ్ చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు