
‘చందమామ’ సినిమాతో తెలుగులో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు ఈ రోజు. 1985 జూన్ 19న కాజల్ ముంబైలో జన్మించింది. అలాగే తన బాల్యాన్ని మొత్తం అక్కడే గడిపింది. కాజల్ తన కాలేజ్ పూర్తి చేసుకున్న తర్వాత మోడల్ గా మారింది. ఆ తర్వాత 2004 లో వచ్చిన ‘క్యుం హో గయా న’ సినిమాలో ఐశ్వర్య రాయ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించింది.
2007 లో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామకి అదే సంవత్సరం వచ్చిన ‘చందమామ’ సినిమా బ్రేక్ ఇస్తే 2009లో వచ్చిన ‘మగధీర’ సినిమా కాజల్ ని సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ ని చేసింది. ఆ తర్వాత నుంచి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో సినిమాలు చేసి హిట్స్ అందుకుంది.
కాజల్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటిస్తోంది. అలాగే త్వరలో ప్రారంభం కానున్న ఎన్.టి.ఆర్ పూరి సినిమాలో కూడా నటించనుంది.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అందాల భామ కాజల్ అగర్వాల్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

