లేడీ డాషింగ్ డైరెక్టర్ బి.జయకి జన్మదిన శుభాకాంక్షలు

b-jaya
సినిమా రంగం అంటే పురుషాధిక్యత ఉన్న రంగం అని అందరూ అంటుంటారు.. కానీ అలాంటి చోట వచ్గ్గి తన సత్తా చాటుకున్నవారు తెలుగు చలన చరిత్రలో నిలిచిపోతారు. ఓ డైరెక్టర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి రికార్డ్ సృష్టించిన దర్శకురాలు, హీరోయిన్ విజయ నిర్మల. అలాంటి విజయ నిర్మల గారి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ని స్పూర్తిగా తీసుకొని, ఆమె వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న లేడీ డాషింగ్ డైరెక్టర్ బి.జయ. ఈమె స్టార్ హీరోని నమ్ముకోడు, స్టార్ కంటెంట్ ఉన్న కథని మాత్రమే నమ్ముకుంటారు. అందుకే ఆమెకి ఓటమి లేదు. అలాంటి ఈ డాషింగ్ డైరెక్టర్ పుట్టిన రోజు ఈ రోజు. చెన్నై యూనివర్సిటీలో జర్నలిజంలో డిప్లమో పూర్తి చేసిన ఆమె ఆంధ్రజ్యోతి పత్రికలో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తరవాత పలు పత్రికల్లో పనిచేసింది.

చివరికి సినిమా అంటే ఉన్న ఆసక్తి కారణం చేత 2003లో ‘చంటిగాడు’ సినిమాతో దర్శకురాలిగా తెలుగు చిత్ర సీమకి పరిచయమై తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, స్టార్ హీరోలు ఎవరూ లేని ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద హిట్ గా నిలిచింది. ఇప్పటి వరకూ 5 సినిమాలు చేసిన బి.జయ చివరిగా చేసిన సినిమా ‘లవ్లీ’. ఆది, శాన్వి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే బి.జయ స్టార్ట్ పి.ఆర్.ఓ అయిన బిఏ రాజు గారి సతీమణి.

ఈ సంవత్సరం బి. జయ తన దర్శకత్వంలో మూడు సినిమాలను డైరెక్ట్ చేయనున్నారు. అందులో అందులో మొదటగా ‘తొక్కుడు బిళ్ళ’ సినిమాని మొదలు పెట్టనున్నారు. జయ గారు హోం బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇది కాకుండా ‘కలిసుందాం.. కండిషన్స్ అప్లై’ అనే సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేసారు. ఈ రెండు సినిమాల తర్వాత కొత్త నటుడు సజన్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయనున్నారు. ఈ మూడు సినిమాలను ఈ సంవత్సరంలోనే ఫినిష్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు.

బి. జయ ఈ సంవత్సరం ప్రారంభించనున్న ఈ సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బి. జయ గారికి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..