నిన్ను ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటాను – మహేష్ బాబు

Published on Sep 22, 2019 1:41 pm IST

ఈ రోజు ‘డాట‌ర్స్ డే’ అన్న విషయం తెలిసిందే. తండ్రులు తమ కుమార్తెలకు ప్రత్యేకంగా ‘కుమార్తెల దినోత్స‌వం’ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త‌న కుమార్తె ‘సితార‌’కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మహేష్ ట్వీట్ చేస్తూ.. ‘ హ్యాపీ డాట‌ర్స్ డే మై లిటిల్ వ‌న్ సీత పాప‌. నువ్వు నాకు ఎప్పటికీ అత్యంత ప్రియ‌మైన ప్రేమపూర్వ‌క‌మైన‌ కూతురివి. నిన్ను ఎప్ప‌టికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను, ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండు’ అని మహేష్ సితారకి శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా మహేష్ ఈ శుభాకాంక్ష‌ల మెసేజ్‌ తో పాటు సితార‌తో ఉన్న ఫొటో వీడియోను కూడా త‌న టిట్ట‌ర్‌ లో పోస్ట్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా, నమ్రత, మహేష్ బాబు ఇద్దరూ తమ అభిమానుల కొరకు తమ కుమారుడు గౌతమ్ కృష్ణ, మరియు కుమార్తె సితార ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ప్ర‌స్తుతం మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :

X
More