యాక్షన్ హీరో ఈ రోజే మొదలుపెట్టాడు !

Published on Dec 15, 2019 4:02 pm IST

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. నిన్న మొదలైందని వార్తలు వచ్చినప్పటికీ అవ్వన్నీ అవాస్తవాలు అని తేలిపోయింది. డైరెక్టర్ సంపత్ నంది ట్వీట్ చేస్తూ… ఈ రోజే షూటింగ్ మొదలైంది, మీ బ్లేసింగ్స్ కావాలని పోస్ట్ చేశారు.

ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది. కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట. కాగా ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More