ఆగస్టు నుండి ‘హరి హర వీరమల్లు’ మొదలు !

Published on Jul 25, 2021 11:10 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. కాగా ఈ సినిమా కొత్త యాక్షన్ షెడ్యూల్ ఆగస్టు ఫస్ట్ వీక్ నుండి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేశారు. ఈ సెట్స్ లోనే షూట్ చేస్తారట. ఇక ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ అట.

కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే క్రిష్ ఈ సినిమాకి మరింత గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం మొత్తానికి ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :