కూతురిని పరిచయం చేసిన బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ..!

Published on Jul 9, 2021 10:53 pm IST

బుల్లి తెరపైనే కాకుండా, వెండితెరపై కూడా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హరితేజ బిగ్‌బాస్ తొలి సీజన్‌లో పాల్గొని సందడి చేయడంతో మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే 2015లో దీపక్‌ రావును పెళ్లాడిన బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కడుపుతో ఉన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ని అందిస్తూ వస్తున్న హరితేజ ఇటీవ‌ల త‌న కూతురి పేరు భూమిక దీపకరావ్ అని పేరు పెట్టినట్టు చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పటివరకు తన కూతురిని సోషల్ మీడియాకు పరిచయం చేయని హరితేజ తాజాగా అందరికి పరిచయం చేసింది. మీట్ మిస్ భూమి దీపక్‌ రావ్‌ అంటూ కూతురి ఫోటోలను హరితేజ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. అయితే బుల్లి హరితేజ ఫోటోను చూసిన నెటిజన్లు అచ్చం హరితేజ మాదిరిగానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :