హరీష్ శంకర్ మొదలుపెట్టనున్నాడు !

Published on Jan 23, 2019 10:28 pm IST

డీజే చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ చిత్రం తరువాత దిల్ రాజు బ్యానేర్ లో దాగుడు మూతలు అనే చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించాడు కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. ఇక ఎట్టకేలకు తన కొత్త చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు ఈ డైరెక్టర్. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయినా జిగర్తండా చిత్రాన్ని హరీష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇక ఈచిత్రంలో వరుణ్ తేజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించనుండగా నాగ శౌర్య హీరోగా నటించనున్నాడు.

ఏకే ఎంటర్టైమెంట్స్ బ్యానేర్ ఫై అనిల్ సుంకర నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :