హరీశ్ శంకర్ ఏదో పెద్ద పనిలోనే ఉన్నారు

Published on Nov 15, 2019 12:11 pm IST

దర్శకుడు హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో మరోసారి తన మాస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నిరూపించుకున్నారు హరీశ్. ఈ చిత్రం తర్వాత ఆయనతో సినిమా చేయాలనుకునే నిర్మాతలు, హీరోల జాబితా కూడా పెరిగింది. ఇప్పటికే పలు ఆఫర్లు ఆయన వద్దకు వెళ్లాయి.

కానీ హరీశ్ శంకర్ మాత్రం హడావుడిగా ఏదో ఒక ప్రాజెక్ట్ సైన్ చేసేయకుండా నిదానంగా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కసరత్తులు చేస్తున్నారు. పనులన్నీ ఒక కొలిక్కి రాగానే ఏ హీరోతో సినిమా అనేది ప్రకటిస్తారట. వాతావరణం చూస్తుంటే హరీశ్ ఏదో పెద్ద సినిమాకే రంగం సిద్దం చేస్తున్నారని అనిపిస్తోంది. మరి ఆ ప్రాజెక్ట్ ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More