టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో, జ్ఞాన సాగర్ ద్వారక రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ హరోం హరా. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మన్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జీ. నాయుడు నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మాలవిక శర్మ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యం యొక్క పవర్ ను చూపిస్తూ టీజర్ కొనసాగింది. వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. టీజర్ లో డైలాగ్స్, మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సుధీర్ బాబును ఇంటెన్స్ అండ్ యాక్షన్ మోడ్ లో చాలా పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు మేకర్స్. ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
