ఈ సారైనా ‘టాలెంటెడ్ హీరోయిన్’కి హిట్ వస్తోందా ?

Published on Jul 11, 2019 6:21 pm IST


రెజీనాకి టాలెంటెడ్ హీరోయిన్ అని.. క్యారెక్టర్ కోసం ఎలాంటి లుక్ లోనైనా.. ఎటువంటి కసరత్తులైన చేస్తోందని ఇలా మంచి పేరు అయితే వచ్చింది గాని.. సరైన హాట్ మాత్రం రావట్లేదు. అప్పట్లో వరుస హిట్స్ తో బిజీ హీరోయిన్ గా మారుతున్న సమయంలో రెజీనాకు ప్లాప్ లు పరిచయం అయ్యాయి. దాంతో అమ్మడికి ఛాన్స్ లు కూడా తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెజీనాకి వచ్చిన మరో మంచి అవకాశం `ఎవ‌రు` సినిమా. ఈ సినిమాలో రెజీనా పాత్ర వైవిధ్యంగా ఉంటుందని.. రెజీనా కెరీర్ కి ఈ సినిమా బాగా ప్లస్ కానుందని చెబుతుంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా రెజీనా బాగా హైలెట్ అయింది.

కాగా వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో అడివిశేష్ హీరోగా రెజీనా క‌సండ్ర హీరోయిన్‌ గా రూపొందుతోన్న ఈ థ్రిల్ల‌ర్ మూవీలో యంగ్ హీరో న‌వీన్ చంద్ర ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌ పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ చిత్రానికి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా ఈ టాలెంటెడ్ హీరోయిన్ కెరీర్ స్పీడ్ అందుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More