
‘నువ్విలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘జీనియస్’తో తన లోని టాలెంట్ ని చూపిన యంగ్ హీరో హవీష్ చేసిన మరి లేటెస్ట్ మూవీ ‘రామ్ లీల’. హవీష్ తో పాటు అభిజిత్, నందిత నటీనటులుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ సమర్పణలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించాడు. చిన్నా మరియు శివమణి కలిసి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. షూటింగ్ తో పాటు అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది.
సెన్సార్ వారి నుంచి కూడా ఈ సినిమాకి పూర్తి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర టీం ఫిబ్రవరి 27న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ చిత్ర టీం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తోంది. చిన్న సినిమా అయినప్పటికీ ఓ మంచి సినిమాని ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యేలా చెయ్యాలని పలు కొత్త రకాల ఆలోచనలతో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రేయాస్ మీడియా వారితో కలిసి బ్యాంకాక్ టూర్ అని ఓ కాంటెస్ట్ ని రన్ చేస్తోంది. ట్రై యాంగిల్ లవ్ స్టొరీ అయిన ఈ సినిమా సక్సెస్ పై హవీష్ చాలా నమ్మకంగా ఉన్నాడు. మలేసియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

