2020 బిగినింగ్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. మహేష్ సరసన హీరోయిన్ గా రష్మిక మందాన మొదటిసారి నటించగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ కీలక పాత్ర చేయడం విశేషం.
కాగా ఈ చిత్రంలోని ‘హి ఈజ్ సో క్యూట్’ లిరికల్ సాంగ్ వీడియో యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని టాప్ రేపింది. సరిలేరు నీకెవ్వరు మూవీ ఆల్బంలో బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా ఉన్న ఈ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకొని 100 మిలియన్ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుంది. దేవిశ్రీ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ అందించగా, మధు ప్రియా ట్రెండీగా పాడి ఆకట్టుకుంది.


