మహేష్ అండ్ టీమ్ కొంచెం అడ్వాన్స్ అయ్యారు

Published on Dec 13, 2019 7:45 pm IST

మహేష్ అండ్ టీమ్ ప్రతి సోమవారం ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం ఇప్పటికే ఒక అప్డేట్ ఇచ్చిన టీమ్ ఇంకో రెండు రోజులు అభిమానుల్ని ఎదురుచూసేలా చేయడం ఎందుకని అనుకున్నారో ఏమో కొంచెం స్పీడ్ పెంచి అడ్వాన్స్ అయ్యారు.

ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు సినిమాలోని హీ ఈజ్ సో క్యూట్ అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. అది కూడా వైరల్ యాప్ టిక్ టాక్ ద్వారా కావడం విశేషం. ఈమేరకు అభిమానుల్ని మహేష్ బాబుని ఆరు పదాల్లో వివరించండి అంటూ సరదా కంటెస్ట్ ఒకటి పెట్టారు. సో.. ఇకపై టిక్ టాక్ మాధ్యమంలో కూడా ‘సరిలేర నీకెవ్వరు’ హడావుడి మొదలుకానుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎంటెర్టైన్మెంట్, సోషల్ మెసేజ్ అన్నీ ఉంటాయట. ఇకపోతే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

More